AP : ప్రకాశంలో నకిలీ నోట్ల కలకలం

AP : ప్రకాశంలో నకిలీ నోట్ల కలకలం
X
పింఛన్ రూపంలో లబ్దిదారులకు పంపిణీ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. ఫేక్ కరెన్సీని నర్సయపాలెం ఉద్యోగి పింఛన్ రూపంలో లబ్దిదారులకు పంపిణీ చేశారు. దీంతో పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సచివాలయ ఉద్యోగి పోలీసులకు సమాచారం అందించారు. అటు దాచేపల్లి, రాజుపాలెం, వినుకొండ ప్రాంతాల్లోనూ నకిలీ నోట్లు బయటపడుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నకిలీనోట్లను మారుస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫేక్‌ కరెన్సీ పల్నాడు జిల్లా వెల్దుర్తి నుంచి తీసుకొస్తున్నట్లుగా గుర్తించారు.

Tags

Next Story