AP : పట్టించుకోని అధికారులు.. మన్యం జిల్లాలో ఏనుగుల హల్ చల్

AP : పట్టించుకోని అధికారులు.. మన్యం జిల్లాలో ఏనుగుల హల్ చల్
గత నాలుగేళ్లలో ఏనుగుల దాడిలో 10మంది మృతి; 5వేల ఎకరాల్లో పంట నష్టం....

పార్వతీపురం మన్యం జిల్లాను ఏనుగులు హడలెత్తిస్తున్నాయి. సమీప గ్రామాల్లోకి తరచూ వస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతీ నిత్యం అటవీ ప్రాంతం నుంచి సమీప గ్రామాల్లోకి వస్తున్న ఏనుగుల మంద.. రైతుల పంటపొలను ధ్వంసం చేస్తున్నాయి. ఇక కాపాలకు వెళ్లిన రైతులపై దాడులు చేస్తూ ప్రాణాలను బలిగొంటున్నాయి. కొన్ని సందర్బాల్లో గ్రామాల్లోకి సైతం చొరబడి స్థానికులను భయాందోళనకు గురి చేయడంతో పాటు దాడి చేసి హతమార్చుతున్నాయి.

తాజా బలిజిపేట మండలం చెల్లింపేట గ్రామంలో ఏనుగుల మంద హల్ చల్ చేసింది. గ్రామంలోకి వచ్చిన ఏనుగులు దేవి నాయుడు అనే వ్యక్తిపై దాడి చేశాయి.ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ దేవి నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గత నాలుగేళ్లలో ఏనుగుల దాడిలో 10మంది మృతి చెందారని స్థానికులు తెలిపారు. ఇక 5వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల సంచారంతో 6వేల మందికి పైగా రైతులకు నష్టపోయినట్లు వెల్లడించారు ఏనుగుల సంచారంపై ఫారెస్ట్‌ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story