AP: మాజీ మంత్రి కూతుహలమ్మ కన్నుమూత

మాజీ మంత్రి,డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కూతుహలమ్మ కన్నుమూశారు. ఉదయం ఆమె తన స్వగహం లో మరణించారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె 1978 లో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పోటీ చేయడంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1985,1989,1999, 2004 ఎన్నికలలో వేపంజేరి నియోజకవర్గం నుంచి, 2009లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 1994 లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో వేపంజేరి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు.1992-1993 మధ్య కాలంలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి మంత్రి వర్గం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా పనిచేశారు. 2004 లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు.టీడీపీలో చేరాక గంగాధర నెల్లూరు నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె తిరుపతి లోని స్వగృహం లో నిద్ర లోనే కన్నుమూసారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com