AP : సైకో చెప్పాడని ఇచ్చిన అనుమతి రద్దు చేస్తారా?

సైకో చెప్పాడని ఇచ్చిన అనుమతి రద్దు చేస్తారా? అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు. రౌడీ రాజ్యాన్ని అంతమొందించడానికి ఇక్కడి నుంచే కౌంట్‌డౌన్ ప్రారంభిస్తున్నానని అన్నారు.అనపర్తి సభలో అస్వస్థతకు గురైన కార్యకర్తలను పరామర్శించారు చంద్రబాబు. ఆపై జగన్ సర్కర్‌పై నిప్పులు చెరిగారు.ఆనపర్తికి చంద్రబాబు వెళ్తే ఏమవుతుందో కానీ..పోలీసులు ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డు కోవడమేంటని ప్రశ్నించారు.
పోలీసులు ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకోవాలని ఎవరో కొందరి డైరక్షన్ లో నడవవద్దని అన్నారు. జగ్గంపేట,పెద్దాపురం లలో లేని ఆంక్షలు అనపర్తిలోనే ఎందుకొచ్చాయాని,కొంతమంది పోలీసులు కావాలని టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారన్నారు. బ్రిటిష్ పై మహాత్మాగాంధీ దండి మార్చ్ చేశారు,కొంత మంది మన పోలీసుల తీరుతో నేను అనపర్తి మార్చ్ చేయాల్సి రావటం బాధాకరమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com