AP : గుడులు కూలగొట్టింది బీజేపీ నాయకులే : మంత్రి బొత్స

బీజేపీపై మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లే ఆలయాలు కూల్చుకుని, బీజేపీ వాళ్లే నిరసనలు చేస్తారని హాట్ కామెంట్స్ చేశారు. అలాంటి ఆలోచనలు తమకు లేవంటూనే.. తమ పార్టీ ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటామని మంత్రి బొత్స చెప్పడం చర్చనీయాంశమైంది. సీఎం జగన్ చేసిన ట్వీట్‌పై బీజేపీ నేతలు వక్రభాష్యం ఆపాలని.. బీజేపీ వాళ్లలా దొంగ జపాలు, డబుల్ గేమ్‌లు తమకు తెలియదని మంత్రి బొత్స అన్నారు.
అటు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కోసం వైసీపీ విశాఖలో సమావేశం నిర్వహించింది. ఈ రాజకీయ సమావేశానికి ఏయూ వీసీ హాజరు కావడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపైనా మంత్రి బొత్స.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. మీ దగ్గర వీడియోలు ఉన్నాయా? అంటూ ఎదురుదాడి చేశారు. తెల్లచొక్కా వేసుకుని ఎవరొచ్చినా తప్పుబడతారా? అంటూ బుకాయించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈసీ చూసుకుంటుందని తప్పించుకునేందుకు ప్రయత్నించారు మంత్రి బొత్స.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com