AP: వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరుడి దౌర్జన్యం

కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరుడు ఇంతియాజ్ బాషా మున్సిపాలిటి స్థలాన్ని ఆక్రమించడమే కాకాకుండా ఓ కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడటం వివాదానికి దారి తీసింది. 20 మందితో కలసి ఇంతియాజ్ తమపై దాడి చేశారంటున్నారు బాధిత కుటుంబసభ్యులు. కర్నూలు సిటీలో పాతబస్టాండ్ అర్బన్ బ్యాంక్ సమీపంలోని నరసింహయ్య కుటుంబం 40 ఏళ్లుగా నివాసం ఉంటోంది. ఆ ఇంటికి సమీపంలో మున్సిపాలిటి స్థలం ఉంది. దీనికి ఎవరికీ కేటాయించలేదు. ఈ స్థలంలోనే నరసింహయ్య కుటుంబం రాకపోకలు సాగిస్తోంది. అయితే దీనిపై కన్నేసిన ఇంతియాజ్ దాన్ని ఆక్రమించుకుని గుడిసే వేశాడు. ఈ స్థలంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులు ఎవరూ నడవకూడదని ఆంక్షలు విధించాడు. నరసింహయ్య కుటుంబానికి వేరే దారి కూడా లేదు. అదే దారిలో నడవాలి దీంతో ఈ స్థలాన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు.
ఈ క్రమంలో ఇంతియాజ్ సైతం హైకోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని పిటీషన్ వేశాడు. తప్పుడు పత్రాలు సృష్టించారనే అభియోగంతో అతని పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అంతే కాకుండా ఆ స్థాలన్ని స్వాధీనం చేసుకోవాలని మున్సిపాలిటి అధికారులకు ఆదేశించింది. కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఎమ్మల్యే అండతో హైకోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరించి ఇప్పుడు ఏకంగా రెండస్థుల భవనాన్ని నిర్మిస్తున్నాడు ఇంతియాజ్. ఈ నిర్మాణాన్ని నరసింహయ్య కుటుంబం అడ్డుకునే ప్రయత్నిం చేసింది. దీంతో ఆగ్రహించిన ఇంతియాజ్ 20 మందితో కలిసి తమపై దాడి చేశారని ఆరోపిస్తన్నారు బాధితులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com