AP: ఎమ్మెల్యే వల్లభనేని అనుచరుల అరాచకం

AP: ఎమ్మెల్యే వల్లభనేని అనుచరుల అరాచకం
వైసీపీ శ్రేణుల అరాచకంతో రణరంగంగా గన్నవరం

విధ్వంస కాండ, అరాచకపర్వం..ఇంత కంటే పెద్ద పతాలు ఉంటే కూడా అవి సరిపోవనట్లు ఉంది బుధవారం గన్నవరంలో వైసీపీ నేతల తీరు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ శ్రేణుల అరాచకంతో గన్నవరం రణరంగమైంది. ఎమ్మెల్యే మనుషులు టీడీపీ కార్యాలయంపై విధ్వంసానికి దిగారు. కర్రలు, రాళ్లతో విరుచుకుపడి దొరికినవారిని దొరికినట్లు బాదారు. ఆఫీస్‌లో ఉన్న కార్లను పగలగొట్టారు. ఓ కారుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.అయితే ఈ అరాచక పర్వానికి పోలీసులే సాక్షిగా ఉండటమే ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అనేందుకు అద్దం పడుతుంది. వైసీపీ నేతలను అన్నా.. అన్నా.. ప్లీజ్‌ అంటూ బ్రతిమిలాడుకోవడం చూస్తుంటే ఏపీ పోలీసులు ఎంత నిస్సహాయత పరిస్థితిల్లో ఉన్నారో అర్ధమైతోంది.

టీడీపీ, వైసీపీ విమర్శల నేపథ్యంలో.. టీడీపీ నేతలకు ఫోన్లలో బెదిరింపులు, ఒకరిద్దరి ఇళ్ల మీదికి వెళ్లడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నా..హఠాత్తుగా వైసీపీ కార్యకర్తలు,వంశీ అనుచరులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా దాడులకు దిగడంతో ప్రశాంతంగా ఉన్న గన్నవరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు కూడా అధికార పార్టీ దుశ్చర్యలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు అయితే ఏం చేయలేని ధీనావస్థలో ఉండిపోయారు. ఇది ప్రారంభం మాత్రమే... వంశీని విమర్శిస్తే మరింత గట్టిగా దాడులు చేస్తామంటూ ఎమ్మెల్యే అనుచరులు బహిరంగంగా అడ్డుకునే నాధుడే కరువైయ్యారన్న విమర్శలు వస్తున్నాయి.

మరో వైపు తమకు వస్తున్న బెదిరింపులపై ఫిర్యాదు చేసేందుకు గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారన్న సమాచారం తెలియగానే ఎమ్మెల్యే వంశీ అనుచరులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.పోలీసులు వీరిని బ్రతిమాలుకుంటున్నా వారిని తోసుకుంటూ టీడీపీ ఆఫీస్‌లోకి దూసుకెళ్లారు.కర్రలు,రాళ్లతో కార్యాలయంలోని అద్దాలు, కంప్యూటర్లు, కుర్చీలు, టేబుళ్లు పగలగొట్టారు. కార్లును ధ్వంసం చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. ఈ విధ్వంసకాండ కొనసాగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు తప్ప వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

Tags

Read MoreRead Less
Next Story