AP : ప్రజల సమస్యలను పరిష్కరించాలంటూ కోటంరెడ్డి నిరసన

AP : ప్రజల సమస్యలను పరిష్కరించాలంటూ కోటంరెడ్డి నిరసన
X

వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నిరసన గొంతుక కార్యక్రమం పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉన్నందున తన కార్యాలయంలోనే నిరసన చేపట్టారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని,విద్యుత్‌, డ్రైయిన్‌ సమస్యలపై ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ప్రయోజనలేదన్నారు.

కొమ్మరిపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్ లో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని 50 సార్లు అడిగినా అధికారుల్లో చలనం లేదన్నారు. అంబేద్కర్‌ భవన్‌, స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని, ప్రశ్నిస్తే తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంత దూరమైనా వెళతానని భయపడేది లేదని అన్నారు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.

Next Story