AP : యువగళం జగన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది : లోకేష్

AP : యువగళం జగన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది : లోకేష్
X
ఒక్క ఛాన్సంటూ దళితుల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్ దళితులకే ద్రోహం చేస్తున్నారు ఆరోపించారు

యువగళం పాదయాత్రతో జగన్ వెన్నులో వణుకు పుడుతోందన్నారు లోకేష్. జగన్ అండతో లిక్కర్, శాండ్, లాండ్ మాఫియా రాష్ట్రంలో చెలరేగిపోతోందని ధ్వజమెత్తారు. తొండవాడ బహిరంగ సభలో వైసీపీ సర్కార్‌పై లోకేష్‌ నిప్పులు చెరిగారు. ప్రజల రక్తాన్ని జగన్ మోహన్ రెడ్డి జలగలా పీల్చుకుంటున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్సంటూ దళితుల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్ దళితులకే ద్రోహం చేస్తున్నారు ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతుంటే సీఎం చోద్యం చూస్తున్నారని విమర్శించారు.

లోకేష్‌కు అడుగడుగునా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అధికారంలోకి రాగానే సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ లోకేష్ భరోసా కల్పిస్తున్నారు.
ఉదయం శివగిరి విడిది కేంద్రంలో సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం లో అభిమానులు లోకేష్‌తో సెల్ఫీలు దిగారు. శానంబట్లలో స్థానికులతో భేటీ అనంతరం పిచ్చినాయుడుపల్లిలో ఎస్సీ వర్గీయులతో సమావేశమయ్యారు.

Tags

Next Story