AP: కలెక్టరేట్ భవనం పైకెక్కి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం

కాకినాడ కలెక్టరేట్ భవనం పైకెక్కి దుర్గా దేవి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. తమ స్థలం, ఇల్లు కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. తమను చంపేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆమె భర్త రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆమెను బుజ్జగించి కలెక్టరేట్ భవనం పై నుండి కిందకు దింపి కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు పోలీసులు.
రాజమండ్రిలోని పెంకుటిల్లు, రాజాం లోని 1200 గజాల స్థలాన్ని కలిపి సుమారు పది కోట్లు విలువ చేసే ఆస్తిని ఫోర్జరీ సంతకాలతో కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుర్గాదేవి దంపతులు ఆరోపించారు. రాజమండ్రిలోని మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి, మా కుటుంబ సభ్యులతోకలిసి మోసం చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా మమ్మల్ని చంపేందుకు కుట్ర పన్నుతున్నారని భార్య భర్తలు వాపోయారు. అధికారులుకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనస్థాపం చెంది కాకినాడ కలెక్టరేట్లు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు న్యాయం చేయాలని మేడిశెట్టి దుర్గాదేవి, రాంబాబు దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com