AP: అత్త సొమ్ము అల్లుడి దానం.. అన్న చందంగా సీఎం జగన్ యవ్వారం

AP: అత్త సొమ్ము అల్లుడి దానం.. అన్న చందంగా సీఎం జగన్ యవ్వారం
పీఎం కిసాన్‌ నిధులను వైఎస్సార్‌ రైతు భరోసా అంటూ కలరింగ్‌

అత్త సొమ్ము అల్లుడి దానం.. ఇది తెలుగునాట ఫేమస్‌ సామెత.. మన ఏపీ సీఎం జగన్‌కు కరెక్ట్ గా సరిపోతుంది అనిపిస్తోంది.పీఎం కిసాన్‌ పథకం కింద 13వ విడత సాయంగా నిన్ననే రైతు ఖాతాల్లో సొమ్ము జమ అయింది. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 16వేల కోట్లను జమ చేశారు. అయితే మన సీఎం గారు.. రైతులను ఉద్దరించేస్తున్నట్లు ఆర్భాటంగా వైఎస్సార్‌ రైతు భరోసా అంటూ ఇవాళ రైతుల ఖాతాల్లో జమచేస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తూ పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేశారు.. అశ్వద్దామ హతః కుంజరహ.. అన్న చందాన చిన్నగా ఇంగ్లీష్‌లో పీఎం కిసాన్‌ అంటూ ట్యాగ్‌లైన్‌ తగిలించారు.

ఇక పీఎం కిసాన్‌ పథకం కింద 13వ విడత సాయంగా దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 16వేల కోట్లను జమ చేశారు.ఇందులో భాగంగానే రాష్ట్రంలోనూ సుమారు 50లక్షల మందికి పైగా రైతులకు రెండు వేల చొప్పున వేయి కోట్లకు పైగా నిధులు అందాయి. ఇవే నిధులకు సీఎం జగన్‌ ఇవాళగుంటూరు జిల్లా తెనాలిలో బటన్‌ నొక్కనున్నారు.వాస్తవానికి ఇందులో ఏపీ సర్కార్‌ 90 కోట్లు మాత్రమే.మిగిలిన వేయి కోట్లను తమ ఖాతాలోనే వేసుకుని, తామే విడుదల చేస్తున్నట్లు బిల్డప్‌ ఇస్తుంది సర్కార్‌. ప్రభుత్వ పనికి రైతులు ఆశ్చర్యపోతున్నారు. పీఎం కిసాన్‌ కింద 2వేలు నిన్నే అకౌంట్‌లో పడితే మళ్లీ బటన్‌ నొక్కడం ఎందుకని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పీఎం కిసాన్‌-రైతు భరోసా కింద ఇప్పటి వరకు 27వేల62 కోట్లు విడుదల చేశామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఒక్కో రైతుకు 13వేల500 చొప్పున ఇస్తున్నామని..దేశ చరిత్రలోనే ఇదో రికార్డు అని సీఎం జగన్‌ ఊదరగొడుతున్నారు. నిజానికి ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి 12వేల500 చొప్పున ఒకేసారి మే నెలలోనే ఇస్తామని ఎలక్షన్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక రెండు విడతల్లో 7వేల500 చొప్పున మాత్రమే ఇస్తోంది. మిగిలిన ఆరు వేలను పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. వాటిని కూడా తమ ఖాతాలో కలిపేసిన సీఎం జగన్‌.. ఏడాదికి మూడుసార్లు బటన్‌ నొక్కుతూ నాలుగేళ్లుగా రైతులను ఉద్దరిస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చేస్తున్నారు. అసలు సీఎం సీఎం ఇవాళ రాష్ట్రంలోని లక్షా72 వేల కుటుంబాలకే 2వేల చొప్పున విడుదల చేస్తున్నారు. నిజాన్ని దాచిపెట్టి 51.12లక్షల కుటుంబాలకు దాదాపు 11వందల కోట్లు ఇస్తున్నామని భారీగా ప్రచారం చేసుకుంటుంది జగన్‌ సర్కార్‌.

Tags

Read MoreRead Less
Next Story