AP : పెట్టుబడి దారుల్లో సీఎం జగన్ విశ్వాసం కలిగించాలి : పవన్ కళ్యాణ్

ఇవాళ, రేపు విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్‌లు చేశారు. పెట్టుబడుల సదస్సుకు విచ్చేస్తున్న పెట్టుబడిదారులకు జనసేన తరపున స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఏపీలోని అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువతకు ఉపాధి అవకా శాలు కల్పించాలని వారిని కోరారు. వైసీసీ సర్కార్ సైతం పెట్టుబడి దారుల్లో విశ్వాసం కల్పించాలని సూచించారు. సదస్సు గురించి ఎలాంటి విమర్శలు చేయబోమని.. తనకు రాజకీయాల కంటే ఏపీ భవిష్యత్తే ముఖ్యమని పేర్కొన్నారు.
అటు వైసీపీ సర్కారుకు పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు. రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కల్గించాలన్నారు. ఈ సమ్మిట్ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకుండా.. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడతోపాటు శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప ఇలా ఏపీలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించాలన్నారు. ఈ రెండు రోజులు ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదని.. రాజకీయం కంటే రాష్ట్రం ముఖ్యమని పవన్ ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com