AP: విద్యుత్‌ ఛార్జీలు పెంచి సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు

AP: విద్యుత్‌ ఛార్జీలు పెంచి సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు
మూడు వేల కోట్ల రూపాయలు విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం నేతల డిమాండ్‌

మూడు వేల కోట్ల రూపాయలు విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. విజయవాడలోని పాలిటెక్నిక్‌ కాలేజీ సమీపంలోని సీపీడీసీఎల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబూరావు పాల్గొన్నారు. జగన్‌ విద్యుత్‌ ఛార్జీలు పెంచి సామాన్యుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ట్రూ అప్‌ ఛార్జీలు వసూలు చేస్తూ ఇప్పుడు సర్దుబాటు ఛార్జీల పేరుతో నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు నరకం చూపుతున్న జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు రాష్ట్రంతా సిద్ధంగా ఉందని అన్నారు. విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలు వెంటనే వెనక్కు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని సీపీఎం నేతలు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story