AP : విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఆయిల్ స్కామ్

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో బోట్ ఓనర్స్ కళ్లు గప్పి ఏళ్ల తరబడి సాగించిన ఆయిల్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఓ వైపు అందని ద్రాక్షగా మారితే.. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ సరఫరా సంస్థ ఐవోసీ ఆయిల్ సరఫరాలో అవకతవకలు సంచలనం రేపుతున్నాయి.
సబ్సిడీ ఆయిల్ సరఫరాలో సరైన ప్రమాణాలు పాటించకుండా తప్పుడు కొలతల మోసం వెలుగుచూసింది. ఓ ఫిర్యాదుతో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. అధికారులు పంచనామా రిపోర్ట్‌లో తక్కువ చేసి చూపిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. స్కామ్ వెనుక అసలు సూత్రధారులు ఎవరో తేల్చాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సీజ్ చేసి ఉన్న బంక్‌ను తెరిపించే పరిస్థితి వస్తే.. కొత్త ఫ్లోయింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com