AP : వైసీపీ ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు : లోకం ప్రసాద్

AP : వైసీపీ ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు : లోకం ప్రసాద్
స్థానిక ఎమ్మెల్యే అప్పలనాయుడు రాజకీయంగా తనను ఎదుర్కోలేకే అధికారులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల లో ఉద్రిక్తత నెలకొంది. భోగాపురం మండలంలో ఉన్న మిరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ లోకి ఆర్డీఓ,ఎమ్మార్వో రావడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. సంస్థలో ప్రభుత్వ భూములున్నాయని నోటీసులిచ్చి స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు అధికారులు.. అయితే స్టే ఆర్డర్‌ ఉన్నా ఎందుకు వేధిస్తున్నారని జనసేన నాయకుడు, సంస్ధ సీఈఓ లోకం ప్రసాద్‌ తో పాటు సంస్థ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే స్థానిక ఎమ్మెల్యే అప్పలనాయుడు కక్షపూరితంగా వ్యవహరిస్తూ అధికారులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story