AP: అదానీకే జెన్‌కో విదేశీ బొగ్గు టెండర్

జెన్‌కో విదేశీ బొగ్గు కొనుగోలు టెండరూ అదానీకే చిక్కింది. టన్ను బొగ్గు 13 వేల 100 రూపాయల చొప్పున ఆ సంస్థ కోట్ చేసి ఎల్1గా నిలిచింది. ఈ మేరకు అదానీ సంస్థతో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశీయ బొగ్గును టన్ను 5 వేలకు జెన్‌కో కొంటోంది. దీని గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ సుమారు 4వేలు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు జీసీవీ 6వేల 500 వరకు ఉంటుంది. చెల్లించే ధరతో పోలిస్తే, పెరిగే జీసీవీ తక్కువే అయినా.. 162శాతం అధిక మొత్తం చెల్లించి అదానీ నుంచి బొగ్గు కొనాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా విదేశీ బొగ్గు టన్ను 9 వేలకు మించి కొంటే భారమేనని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఖజానాపై పడే అదనపు భారం సుమారు 300 కోట్ల రూపాయలు. బొగ్గు కొనుగోలుకు 982 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com