AP: అమరావతిపై నేడే సుప్రీంలో విచారణ
By - Subba Reddy |28 March 2023 6:30 AM GMT
ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు
అమరావతి రాజధాని పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును యధాతథంగా అమలు చేయాలని రైతులు పిటిషన్ వేశారు. రెండు పిటిషన్లను జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి. నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.మరోవైపు విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పడిందని కేంద్రం అఫిడవిట్ ను దాఖలు చేసింది. మూడు రాజధానుల గురించి తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com