AP : వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి ఆదరణ కరువు

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి ఆదరణ కరువయ్యింది. వెంకటగిరిలో జనం లేక ఆసరా కార్యక్రమం వెలవెలబోయింది. వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరిగిన ఆసరా కార్యక్రమానికి డబ్బులిస్తామని చెప్పి కొంత మంది మహిళలను తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. అయితే కార్యక్రమానికి వచ్చిన మహిళలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన ్యక్తం చేస్తున్నారు. మీటింగ్ జరుగుతుండగానే పలువురు మహిళలు కళ్లు తిరిగిపడిపోయారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక వైసీపీ నేతల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసరా కార్యక్రమం పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. కార్యక్రమానికి తీసుకొచ్చిన వైసీపీ నేతలను తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com