AP : లారీ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు

AP : లారీ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో లారీ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు మిన్నంటాయి. అక్రమంగా బూడిదను అధిక ధరలకు అమ్ముకుంటున్నారని నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం గేటు వద్ద ధర్నాకు దిగారు. అక్రమాలకు పాల్పడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక గ్రామాలకు అవకాశం కల్పించి లారీలను కొనిపించారని.. ఇప్పుడు బడాబాబులకు బూడిద అమ్ముకుని తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా 10 జేసీబీల సాయంతో బూడిదను అక్రమంగా తరలిస్తూ తమ కడుపులు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read MoreRead Less
Next Story