AP: డిప్యూటీ సీఎంను నిలదీసిన యువత

AP: డిప్యూటీ సీఎంను నిలదీసిన యువత
X

చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ తగిలింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలో గడప గడపకు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రిని యువత, నిరుద్యోగులు ప్రజలు నిలదీశారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి ఏంచేసావని ప్రశ్నల వర్షం కురిపించారు. చదువుకున్న తమకు ఉద్యోగాలు లేవని యువత ఫైర్ అయ్యారు. డీఎస్సీ, టెట్ ఎందుకు నిర్వహించలేదని నిరుద్యోగులు నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డీఎస్సీ పెట్టారు తప్ప.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని మండిపడ్డారు. దాంతో ప్రజలకు సమాధానం చెప్పలేక డిప్యూటీ సీఎం నారాయణస్వామి కార్యక్రమం మధ్యలోనే వెనుదిరిగి వెళ్లారు.

Tags

Next Story