AP : ఏపీలో చార్టెర్డ్ అకౌంటెంట్‌ల పరిస్థితి దారుణం : నేతి మహేష్

ఏపీలో చార్టెర్డ్ అకౌంటెంట్‌ల పరిస్థితి దారుణంగా ఉందని ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు అన్నారు. విజయవాడలో చార్టర్డ్ అకౌంటెంట్స్‌ల అరెస్టులో చట్టబద్దత ఎంత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, ఇతర చార్టర్డ్ అకౌంటెంట్లు పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో ఎంతోమంది జీవితాలను తారుమారు చేశారని నేతి మహేష్ ఆరోపించారు. అమర్ రాజా సహా అనేక పరిశ్రమలను తరిమేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన ఘనత జగన్‌దే అన్నారు. రాజకీయ కుట్రలతోనే మార్గదర్శి మీద కేసులు పెట్టారని విమర్శించారు. ఏపీలో చట్ట బద్దమైన పాలన జరగడం లేదని నేతి మహేష్ ధ్వజమెత్తారు.
ఏపీలో చట్ట బద్దమైన పాలన జరగడం లేదని జడా శ్రావణ్‌కుమార్ ధ్వజమెత్తారు. చట్టాలను కూడా చుట్టాలుగా మార్చుకుని ఇష్టారీతిగా సెక్షన్లు పెడుతున్నారని ఆరోపించారు. సీఏ లను అరెస్టు చేయాలంటే కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయన్నారు. చీటింగ్ జరిగినట్లు నిర్దారణ కాకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. 409 సెక్షన్ ఏ విధంగా పెట్టారో అర్ధం కావడం లేదన్నారు. కంపెనీ సిబ్బందిని అరెస్టు చేయడమే లక్ష్యంగా ఏపీలో పోలీసులు పనిచేస్తున్నారని జడా శ్రావణ్‌కుమార్ విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com