AP : వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓడిపోవడం ఖాయం : నారాయణ

AP : వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓడిపోవడం ఖాయం : నారాయణ
X

వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓడిపోవడం ఖాయమని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వైసీపీని ఓడించాలన్న పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం మంచిదేనన్న ఆయన.. దానికోసం బీజేపీతో జతకట్టాల్సిన అవసరం లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఒంటరిగా ఎన్నికల్లో పోటీకి వెళ్లాలని నారాయణ సూచించారు. ఇక రాష్ట్రంలో భూకబ్జాలకు అసలు సూత్రధారులు వైసీపీ నాయకులు, కార్యకర్తలేనని ఆయన విమర్శించారు. నిరుపేదలు, రైతుల భూములు కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Tags

Next Story