AP : యువకులపై చిందులు తొక్కిన అవంతి శ్రీనివాస్

మరోసారి ఫ్రస్టేషన్‌కు గురయ్యారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. చిప్పాడ గ్రామంలో జరిగిన ఆసరా కార్యక్రమ సభలో ఉద్యోగాలపై అడిగిన యువతపై మాజీ మంత్రి, ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న దివీస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ బాలు అనే యువకుడు స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో సహనం కోల్పోయారు.మీరు ఎవరైనా కానీయండి..నేను చెప్పేదే వినండి అంటూ సీరియస్ అయ్యారు.గ్రామం అంటే ఓ పద్దతి ఉంటుంది.. సర్పంచ్ గా గెలిచిన వ్యక్తి ఉన్నారు అయనకు ధరఖాస్తు ఇస్తే వాళ్లు నాకు ఇస్తారు అంటూ ఫైర్ అయ్యారు. స్థానిక యువత ఉద్యోగాల కోసం పట్టుబట్టడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే "ఏవండీ సీఐ గారు ఏం చేస్తున్నారు? ఎవడ్రా ఆడు ..నువ్వు యూజ్‌లెస్ ఫెలో.. తమాషాలు చేస్తున్నారా.. మాట్లాడకండి" అంటూ అవంతి శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు.. దీంతో పోలీసులు అక్కడున్న యువకులను పంపించేశారు. ‘గ్రామంలో సర్పంచి, మాజీ సర్పంచి ఇద్దరూ మనవాళ్లే ఉన్నారు. వారికి దరఖాస్తులు ఇస్తే నాకు అందజేస్తారు. అంతేకానీ.. రోడెక్కి అరిస్తే ఉద్యోగాలు రావు అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com