AP : జగన్‌ సర్కార్‌ పై బాలకృష్ణ ఫైర్

AP : జగన్‌ సర్కార్‌ పై బాలకృష్ణ ఫైర్
ఈ సైకోని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తే ఏపీ ప్రజలు మరో రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తుందని అన్నారు

జగన్‌ సర్కార్‌ పై మండిపడ్డారు సినీ నటుడు, ఎమ్మల్యే బాలకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు అర్థం కాదని,15 లక్షల కోట్లు బడ్జెట్ పెడితే ప్రజలకు ఏమి అర్థం అవుతుందని ప్రశ్నించారు. సీఎం ఎవరినైనా బెదిరించొచ్చని చూస్తున్నారని అరోపించారు. బడ్జెట్ అంకెల గారడీమాత్రమేనని,రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అందరూ కంకణ బద్ధులై పోరాటం చేయాలని అన్నారు.ఓటు అనే ఆయుధంతో మీ నాయకుడిని మీరు ఎన్నుకోవాలని అన్నారు.ఏపీలో అసమర్థ, చెత్త ప్రభుత్వము ఉందన్నారు.

లోకేష్ పాదయాత్ర యువతరానికి స్ఫూర్తి అన్నారు బాలయ్య. టీడీపీ యువతకు ఏం చేసింది అనేది లోకేష్ తెలియజేస్తున్నాడని అన్నారు. లోకేష్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుందన్న బాలయ్య చెత్త మీద పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉందని ఫైర్‌ అయ్యారుఏపీలో డ్రగ్స్ గంజాయ్ కలవరానికి గురిచేస్తుందని,కేంద్రం నుండి నిధులు కూడా రాబట్టుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే వారి ఉద్యమాన్ని నిలిపివేయడం వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు ఎన్టీఆర్, చంద్రబాబులు మహానుభావులు అన్నారు బాలయ్య ఏపీలో వినాశనం కాని వ్యవస్థ ఏమీ లేదని,సీఎంకు పరిపాలన చేతకావడం లేదని అన్నారు ఆయన చుట్టూ 20 నుండి 30 మంది సలహాదారులు ఎందుకని వారికి జీతాలు దండగ అంటూ మండిపడ్డారు. ఈ సైకోని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తే ఏపీ ప్రజలు మరో రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. కులాల రొచ్చులో పడి ఓటు అనే ఆయుధాన్ని వృధా చేయద్దని ప్రజలను కోరారు.

Tags

Read MoreRead Less
Next Story