AP : సలేశ్వరం జాతర గడువు పొడిగింపు

AP : సలేశ్వరం జాతర గడువు పొడిగింపు
భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 9వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొదట జాతరను మూడు రోజులకు కుదించారు అధికారులు.

నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలోని సలేశ్వరం జాతర గడువు పొడిగించారు అటవీశాఖ అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 9వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొదట జాతరను మూడు రోజులకు కుదించారు అధికారులు. అయితే లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో జాతరలో అపశృతి నెలకొంది. తొక్కిసలాటలో ఓ భక్తుడు మృతి చెందాడు. ఈ ఘటనలో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు, పోలీసుల నిర్లక్ష్యంగా వల్లే ఈ ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇక లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు కేవలం మూడు రోజుల అనుమతి మాత్రం ఇవ్వడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. సయమం తక్కువగా ఉండటంతో సలేశ్వరం జనసంద్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న అటవీశాఖ అధికారులు... ఎట్టకేలకు ఈ నెల తొమ్మిది వరకు స్వామివారి దర్శించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే వంద మంది పోలీసులతో భక్తులకు భద్రత కల్పిస్తున్నామన్న ఎస్పీ మనోహార్‌.. తాజాగా అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు వెల్లడించారు.

Tags

Next Story