AP : కేతిరెడ్డివి చీప్ పాలిటిక్స్ : పరిటాల శ్రీరామ్

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డివి చీప్ పాలిటిక్స్ అన్నారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొండలపై వాటర్‌ట్యాంక్‌లు కట్టడం సామాన్యులకు సాధ్యమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకు ఒక న్యాయం.. కేతిరెడ్డికి ఒక న్యాయమా? అంటూ ఫైర్ అయ్యారు. లోకేష్ రైతులతో చర్చించి సమస్యలపై హామీలు ఇస్తున్నారని,రైతులకు ఇచ్చే డ్రిప్‌ను ఆపిన సీఎంగా జగన్ రికార్డులకెక్కాడని అన్నారు.
కేతిరెడ్డి..తనతో పోల్చుకోవడం తగ్గించుకోవాలని,తనపై చెడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్‌పై కేతిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను సహించేది లేదన్న శ్రీరామ్‌ఎర్రగుట్ట.. ఫాంహౌస్‌గా ఎలా మారిందని అన్నారు. కేతిరెడ్డి చేసిన సవాల్ మేరకు గుర్రాల కోటపై సాక్ష్యాలతో సహా ఆధారాలను చూపించామన్నారు. మార్ఫింగ్ ఫోటోలకు బదులు స్వయంగా సర్వే చేసి మిగులు భూములు రైతులకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.తన పక్క భూమి సూర్యనారాయణరెడ్డిది అని కేతిరెడ్డి చెబుతున్నారని.. ఆయన మేడాపురం సూరికి, కేతిరెడ్డికి ఆత్మ లాంటి వాడని శ్రీరామ్ ఆరోపించారు.మాట మాట్లాడితే క్రెడిబులిటి ఉండాలని అది ఆయనలో ఎక్కడా కనిపించడం లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com