AP : జగన్ ప్రభుత్వంపై అయ్యన్న పాత్రుడు ఫైర్

జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. విద్యుత్ వాడకం పేరుతో దివ్యాంగురాలి పెన్షన్ కట్ చేసిన ప్రభుత్వంపై ట్వీట్ చేశారు.అందుకే మిమ్మల్ని హాఫ్ బ్రెయిన్ సన్నాసులు అన్నామని, సంక్షేమ పథకాలు రద్దు చేయడంలోని భాగమే ప్రభుత్వం చేస్తున్న ఫ్యాక్ట్ చెక్ అంటూ మండిపడ్డారుసీమా పర్విన్‌కు పెన్షన్ రద్దు చేయడం అమానవీయ చర్య అంటూ ట్వీట్ చేశారు అయ్యన్న పాత్రుడు.
మరోవైపు మచిలీపట్నంకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు సీమ పర్వీన్ ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేశారు.18 ఏళ్లు వచ్చినా ఇప్పటికి ఆమె తల్లిదండ్రుల సహాయంతోనే తన రోజు వారి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. గత టీడీపీ హయాంలో పెన్షన్ కు అర్హురాలు అయి, నేడు అనర్హురాలు ఎలా అయ్యిందని టీడీపీ అధినేత కూడా ఇటివలే ప్రశ్నించారు. 90శాతం వైకల్యం ఉన్న అమెకు నిబంధనల పేరుతో..పెన్షన్ తొలగించడమే మీ మానవత్వమా? అంటూ మచిలీపట్నం బహిరంగ సభలో పశ్నించారు చంద్రబాబు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com