AP : "లోకేష్ పాదయాత్రతో ఎమ్మెల్యే కేతిరెడ్డికి మైండ్‌ బ్లాంక్‌"

AP : లోకేష్ పాదయాత్రతో ఎమ్మెల్యే కేతిరెడ్డికి మైండ్‌ బ్లాంక్‌

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. దారి పొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వైసీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో లోకేష్‌ పై నమ్మకం పెంచుకున్న ప్రజలకు ఆయన అడుగులో అడుగు వేస్తూ ముందుకు నడుస్తున్నారు. లోకేష్ వస్తున్న ప్రజాదరణ చూస్తుంటే వైసీపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని వారి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందని అంటున్నారు ప్రజలు. ఈ ప్రస్టేషన్ ఏం చేయాలో అర్ధం కాక ప్రజలపైనే నోరు పారేసుకుంటున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర గ్రాండ్‌ సక్రెస్‌ అయింది. మరీ ముఖ్యంగా ధర్మవరంలో భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అక్రమాలను లోకేష్‌ అధారాలతో సహా బయటపెట్టారు.గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి చేసేవి కబ్జాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లు అని నిన్న లోకేశ్ ఆరోపించారు. ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. 902, 909 సర్వే నెంబర్లలోని 20 ఎకరాలను కేతిరెడ్డి ఆక్రమించారని మండిపడ్డారు. ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే విలాస కార్యక్రమాలకు అడ్డా అని లోకేష్‌ ధర్మవరం గడ్డపైన గర్జించారు.

ధర్మవరంలో లోకేష్ పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్‌ను చూసి ఎమ్మెల్యే కేతిరెడ్డికి మైండ్‌ బ్లాంక్‌ అయిందంటున్నారు నెట్‌జన్లు. అయన ఫ్రస్టేషన్‌ అంతా స్ధానికులపై చూపిస్తున్నారు. లోకేష్‌ ఛాలెంజ్‌లకు సమాధానం చెప్పలేక నియోజక వర్గంలోని ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ధర్మవరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నా నియోజకవర్గ ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నాను అన్నారు.. ఉదయమే నేను ప్రతీ ఇళ్లు తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నాను..మధ్యాహ్నం నా భార్య తిరుగుతుంది.. సాయంత్రం నా తమ్ముడు తిరుగుతున్నాడు.. ఇలా మా కొంపంతా మీకు చాకిరీ చేస్తున్నామంటూ జనంపై కాస్త అసహనం వ్యక్తం చేశారు.. ఇలా మా ఇంటిల్లిపాది మీకే చాకిరీ చేస్తున్నాం. అంటూ నిండు సభలో అనడంతో పాటు భోజనాలకు వెళుతున్న వారిపై కూడా నోరు జారి మాట్లాడారు. కేతిరెడ్డి ఫ్రస్ట్రేషన్ పై ప్రజలు మండిపడుతున్నారు.మీ బిల్డప్ కోసం మీరు వచ్చి..మాపై అసహనం వ్యక్తం చేస్తే ఎలా అంటూ కొందరు ప్రజలు అనుకుంటూ సభ నుంచి వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story