AP : ఇంటర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్, ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య

AP : ఇంటర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్,  ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య

పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు 9 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వెల్లడించిన 24గంటల్లో 9 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలో 2023కుగాను దాదాపు 10లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరయ్యారు. అందులో 11వతరగతిలో ఉత్తీర్ణత శాతం 61కాగా, 12వ తరగతిలో 72శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 17 ఏళ్ల బాలుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు శ్రీకాకులం జిల్లాలోని దండు గోపాలపురం గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి. చాలా పేపర్లలో ఫెయిల్ కావడంతో నిరుత్సాహానికి గురయినట్లు సమాచారం.
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రినాధపురంలోని 16 ఏళ్ల బాలిక తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఈవిడ విశాఖపట్నం జిల్లాకు చెందినది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం కంచరపాలెంలో మరో 18 ఏళ్ల యువకుడు తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. వీరితో పాటు.. చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు, అనకాపల్లికి చెందిన మరో విద్యార్థి ప్రాణాలు విడిచారు. విద్యార్థులు ఆత్మహత్యల విషయంపై నిపుణులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు తట్టుకుని నిలపడేలా ఉండటం లేదని అందుకు తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story