AP : రైతుల కష్టాలు జగన్‌కు పట్టవు : చంద్రబాబు

రైతుల కష్టాలు జగన్‌కు పట్టవని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలో పర్యటించిన చంద్రబాబు... అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని.. తన పర్యటనతోనే అధికారుల్లో కాస్త చలనం వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి ఓట్లు అడిగిన జగన్.. అధికారంలోకి వచ్చాక ప్రజల్ని పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. మరోవైపు చంద్రబాబు పర్యటనలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. చంద్రబాబు రోడ్ షోగా వెళ్తు రైతులను పరామర్శిస్తున్న సమయంలో పోలీసులు కాసేపు హంగామా చేశారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేమ్ బ్యాడ్జ్ లేకుండా డ్యూటీ ఎలా చేస్తున్నారని పోలీసులను చంద్రబాబు నిలదీశారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబు హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com