AP : తిరుమలలో భారీ వర్షం

AP : తిరుమలలో భారీ వర్షం

తిరుమలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వానకు బలమైన ఈదురు గాలులు కూడా తోడవ్వడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. తిరుమల కొండపై పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉదయం తీవ్ర ఎండ, వేడి గాలులతో అవస్థలు పడిన భక్తులు.. మధ్యాహ్నం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. భక్తులు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని టీటీడీ సూచించింది.

ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఒంగోలులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారు మబ్బులు కమ్ముకోవడంతో చిమ్మ చీకటిని తలపించింది. ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, మార్కాపురం, కందుకూరు, అద్దంకి ప్రాంతాలలో వర్షాలు కురిసాయి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌తో పాటు.. పలు చోట్ల రోడ్లపై వర్షం నీరు చేరింది. శివారు కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Next Story