AP : అఖిలప్రియ అరెస్ట్

AP : అఖిలప్రియ అరెస్ట్

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిలప్రియ వర్గీయుడు ఎ.వి. సుబ్బారెడ్డిని కొట్టడంతో ఆయనకు గాయమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేశారు. టీడీపీ జాతాయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేష్ కు స్వాగతం పలకడానికి అఖిలప్రియ, ఎ.వి. సుబ్బారెడ్డి సభాప్రాంగనానికి చేరుకున్నారు. అయితే అఖిలప్రియ వర్గానికి సుబ్బారెడ్డి వర్గానికి చాలాకాలంగా వైరం నడుస్తోంది. ఈ క్రమంలో అఖిలప్రియ అనుచరుడు సుబ్బారెడ్డిపై చేయిచేసుకున్నాడు. దీంతో అతని ముక్కులోనుంచి రక్తం కారింది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. ఈ విషయంపై అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story