AP : కుప్పంలో ఏనుగుల బీభత్సం

AP : కుప్పంలో ఏనుగుల బీభత్సం

తమిళనాడులోని కృష్ణగిరి, ఆంధ్రప్రదేశ్‌ కుప్పంలో బీభత్సం సృష్టించిన ఏనుగులను ఎట్టకేలకు బంధించారు అటవీశాఖ అధికారులు. కుప్పంలో గతవారం నలుగురిని తొక్కి చంపిన రెండు మదపుటేనుగులను, బంధింది హోసూరు అటవీ ప్రాంతానికి తరలించారు. రెండు ఏనుగులు తిరుపత్తూరు సమీపంలోని పొలాల్లో భీకర పోరాటానికి దిగాయి. భయాందోళ చెందిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏనుగులకు మత్తు మందు ఇచ్చి బంధించారు అటవీ శాఖ సిబ్బంది.

రెండు ఏనుగులలో ఒకదానికి మత్తు ఇచ్చి బంధించగా, రెండోది చాకచక్యంగా తప్పించుకుంది. తప్పించుకున్న ఏనుగు జాడ కనిపెట్టిన అటవీశాఖ అధికారులు ఆ ఏనుగుకు మత్తు మందు ఇచ్చి బంధించారు. వారం రోజు పాటు కుప్పం వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఏనుగులను బంధించడంతో, ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు.

అడవులు నరికివేతతో పంటపొలాల్లో తిష్ట వేస్తున్నాయి వన్యప్రాణులు. ఆహారం కోసం పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఊళ్లల్లోకి చొరబడి మనుషులపైనా దాడులకు పాల్పడుతున్నాయి. అభివృద్ధి పేరుతో, ధన దాహంతో వాటికున్న కాస్త జాగాను కబ్జా చేస్తున్నారు కొందరు భూ భకాశూరులు. వన్య ప్రాణులు తలదాచుకునేందుకు ఉన్న కాస్త అడవులను నరికి సొమ్మ చేసుకుంటున్నారు. గతంలో శ్రీకాకుళంలో పంట పొలాల్లో బీభత్సం సృష్టించాయి ఏనుగులు. మదపుటేనుగుల దాడిలో ఎంతో మంది రైతులు మృత్యువాత పడ్డారు.

అటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు పంటలను నాశనం చేయడమే కాకుండా ప్రజలపై దాడి చేస్తూ ప్రాణాలను తీస్తున్నాయి. ఏనుగుల గుంపు గ్రామాల వైపు రాకుండా జిల్లాకు చెందిన 13 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఏనుగులు గ్రామం వైపు రాకుండా చూసే క్రమంలో వాటి బారిన పడి గాయాల పాలవ్వడం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా ఉన్నాయి.

ఏనుగులు చేసిన దాడుల్లో పంట నష్టాలైతే కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. వన్యప్రాణ రక్షణ చట్టం మేరకు అటవీశాఖాధికారులు ఏనుగులకు రక్షణ కల్పిస్తునే... రైతులు పంటలు నష్టపోకుండా చూడాల్సి వున్నా అటువంటి చర్యలేవీ చేపట్టడం లేదు. వాటిని ఒడిశా లభేరి అడువులకు లేకుంటే, జూకైన తరలించాలని రైతులు, గిరిజనులు కోరుతున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి ఏనుగులను తరలించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని, పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story