AP: కర్నూలులో హై టెన్షన్‌

AP: కర్నూలులో హై టెన్షన్‌
X

కర్నూలులో హై టెన్షన్‌ నెలకొంది. అవినాష్‌రెడ్డి ఉన్న ఆస్పత్రి చుట్టూ పోలీసులు మోహరిస్తున్నారు. చీకటి పడ్డాక సీబీఐ అధికారులు ఆస్పత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విశ్వభారతి ఆస్పత్రి చుట్టూ పోలీసు వాహనాలు క్యూ కడుతున్నాయి. ఆస్పత్రి దగ్గర రోప్‌ పార్టీలు సైతం సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు రోప్‌ పార్టీ పోలీసులతో అవినాష్‌ వర్గీయులు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీస్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి సీబీఐ వాహనం బయటకు వచ్చింది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సుప్రీంకోర్టులో అవినాష్‌ రెడ్డికి చుక్కెదురైంది. అవినాష్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ తాము చెప్పలేమని సుప్రీంకోర్టు తెలియజేసింది.

Next Story