AP: నేడే లాటరీ.. లిక్కర్ లక్ ఎవరికో?

ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం నేడు లాటరీ తీయనున్నారు. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన షాపుల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీస్తారు. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల మేర ఆదాయం వచ్చింది.
మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. జిల్లాలో ఎంపిక చేసిన ప్రత్యేక కేంద్రంలో జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో సోమవారం లాటరీ నిర్వహించారు. ఈ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసుశాఖ గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెద్ద అమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ప్రారంభించారు. ఫంక్షన్ హాల్ వద్దకు దరఖాస్తుదారులు పోటెత్తారు. ఉదయం 6 గంటలకే హాలు వద్దకు దరఖాస్తుదారులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం 8 గంటలకు కలెక్టర్ చేతుల మీదగా లాటరీ విధానాన్ని ప్రారంభించడం జరిగింది.
విజయనగరంలో మొత్తం 153 షాపులకు 5,242 దరఖాస్తులు దాఖలు. కలెక్టరేట్ ఆడిటోరియంలో లాటరీ ప్రక్రియను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్. సేతు మాధవన్.
రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గంలో మద్యం దుకాణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు ఎదురుచూస్తున్న నేపథ్యంలో.ఈరోజు లాటరీ ద్వారా దుకాణాలను ప్రభుత్వం కేటాయించనుంది. ఈ తరుణంలో మద్యం కిక్కు లక్కు ఎవరికి తొక్కుతుందో వారు అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. మద్యం దుకాణాలుకోసం, ఆన్లైన్ దరఖాస్తులు ప్రక్రియ ఈనెల 11 అర్ధరాత్రి తో ప్రశాంతంగా ముగిసింది. రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం సర్కిల్లో పదం మద్యం షాపులకు గాను 240 మంది దరఖాస్తులు చేసుకోగా, చింతూరు సర్కిల్ లో 8 మద్యం షాపులకు గాను, 412 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నియోజకవర్గ ద్వారా ప్రభుత్వానికి రూ 8.24 కోట్ల మేర ఆదాయం ఆదాయం చేకూరనుంది.అల్లూరి జిల్లా వ్యాప్తంగా 40 మద్యం దుకాణాలకు గాను, 1205 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా, ఎక్సైజ్ శాఖకు రూ 24.40 కోట్ల మేర ఆదాయం చేకూరనుంది. ఈ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం నేడు అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరులో లక్కీ డ్రా తీయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com