AP: 2019తో పోల్చితే.. రెండింతలైన ఏపీ అప్పు

AP: 2019తో పోల్చితే.. రెండింతలైన ఏపీ అప్పు
బడ్జెట్‌ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీ అప్పు 4 లక్షల 42 వేల 442 కోట్లు

2019తో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్ అప్పు దాదాపు రెండింతలైంది. ఏటేటా రాష్ట్రానికి అప్పుల భారం పెరుగుతోంది. బడ్జెట్‌ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీ అప్పు 4 లక్షల 42 వేల 442 కోట్లుగా ఉంది. 2019లో 2 లక్షల 64 వేల 451 కోట్లు ఉండగా 2020లో 3 లక్షల 7 వేల 671 కోట్లు.. 2021లో 3 లక్షల 53 వేల 21 కోట్లు..2022లో 3 లక్షల 93 వేల 718 కోట్ల అప్పు తెచ్చారు. 2023 బడ్జెట్‌ అంచనాల ప్రకారం అప్పు 4 లక్షల 42 వేల 442 కోట్లుగా ఉంది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఐతే ఇప్పటికే ఏపీ అప్పు 10 లక్షల కోట్లకు చేరిందని ప్రతిపక్షాల విమర్శలు చేస్తున్నాయి.

Tags

Next Story