AP : మే22 న ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి శ్రీకారం

ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే తీర్చాలని డిమాండ్ చేశారు చాంద్ బాష . మే22 న ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. అక్టోబర్31న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. నవంబర్ లో నిరవధిక సమ్మెకు సిద్ధమని ఆయన అన్నారు. 22వతీదీన రిలే నిరాహారదీక్షకు దిగుతామని, తర్వాత అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమరించడం తరవాత ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలివేయడం బాధాకరమన్నారు.
12వ పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని, మాకు పీఆర్సీ పై ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే అక్టోబర్31 న విజయవాడలో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం అప్పటికైనా ముందుకు రాకపోతే నిరవధిక సమ్మెకు పిలుపు నిస్తామని హెచ్చరించారు. ఔట్ సోర్సింగ్ కార్మికులుకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి గాలికి వదిలేసి చోద్యం చూస్తూ కూర్చోవడం ఏమిటని ప్రశ్నించారు. అనేక రాష్ట్రాలలో సీపీఎస్ ను రద్దుచేసినా ఎంతవరకు పట్టించుకోక పోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఉద్యోగుల జూన్ మొదటి వారంలో గుంటూరు నగరంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com