AP : విజయవంతంగా 65వ రోజు యువగళం పాదయాత్ర

AP : విజయవంతంగా 65వ రోజు యువగళం పాదయాత్ర

నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 65వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌... స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక జంబులదిన్నెలో పంటపొలాలను పరిశీలించారు లోకేష్‌. పాదయాత్రలో భాగంగా బత్తాయి తోటల్లోకి వెళ్లిన యువనేత.. అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు ఎకరాల్లో బత్తాయి పంట వేశానని.. అందులో అంతర్ పంటలు వేస్తున్నట్లు చెప్పాడు. అయితే ప్రభుత్వం డ్రిప్ ఇవ్వడంలో జాప్యం చేస్తోందని లోకేష్ దృష్టికి తీసుకెళ్లాడు రైతు వన్నూరపప్. తాను దళితుడినని అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట పెట్టుబడులు పెరిగిపోయాయని.. పంటలు చేతికొచ్చే సమయానికి ధర అమాంతం తగ్గడంతో తీవ్ర నష్టాల పాలు అవుతున్నట్లు లోకేష్ దృష్టికి తీసుకెళ్లాడు.

నాడు చంద్రబాబు డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహించడం వల్లే నేడు రైతుల లాభదాయకంగా పంటలను సాగు చేస్తున్నారని లోకేష్‌ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులను ఏమాంత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జగన్ రైతులకు సబ్సిడీలు ఇవ్వకుండా ఇబ్బందలు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు సబ్సీడిని మళ్లీ చేరువ చేస్తామన్నారు. ఇక లోకేష్‌ పంటపొలాల్లోకి రావడంతో రైతుల సంబరపడిపోయారు. లోకేష్‌ తమ వద్దకే వచ్చి సమస్యలు తెలుసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఇక యువ నేతతో సెల్ఫీలు దిగేందుకు రైతులు ఎగబడ్డారు.

Next Story