AP: ఈ నెల 8 నుంచి ఉద్యోగుల మూడో దశ ఉద్యమం

ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ మళ్లీ ఈ నెల 8వ తేదీ నుంచి మొదలవుతుందన్నారు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఈ మేరకు మూడో దశ ఉద్యమ కార్యాచరణపై బొప్పరాజు నేతృత్వంలోని ఉద్యోగులు సీఎస్ జవహార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం వివరాలను సీఎస్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో తెలంగాణలో చేసినట్టు ఏపీలో కూడా చేయాలని సీఎస్‌ను కోరామని తెలిపారు కొత్త డీఏ కూడా వెంటనే చెల్లించాలని సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
వీలైనంత త్వరగా ఆర్థికేతర సమస్యలపై అధికారులతో మాట్లాడుతామని సీఎస్ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే, ఇచ్చిన హామీలు అమలుకాకపోతే తిరిగి ఉద్యమ కార్యాచరణ మొదలవుతుందని.. మూడో దశలో ప్రాంతీయ సదస్సులుంటాయన్నారు. ఈ నెల 30న ఉద్యోగుల సమస్యలపై నిరాహార దీక్ష ఉంటుందన్నారు. చలో విజయవాడ వంటి కార్యక్రమాలు చేస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక పరమైన అంశాల విషయంలో వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని కోరినట్లు బొప్పరాజు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com