AP: మంత్రి అంబటిపై కేసు నమోదు... కోర్టు ఆదేశం

ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదుకు గుంటూరు జిల్లా కోర్టు ఆదేశాలు జారిచేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరిట జరిగిన టికెట్ల అమ్ముకాల వ్యవహరంలో వైసీపీ నేతల పేర్లు బయటకు వచ్చాయి. అంబటి నేతృత్వంలోనే లక్కీ డ్రా టికెట్ల అమ్మకాలు జరిగాయని సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులో జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీంతో తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది.
మరోవైపు అంబటి వ్యవహారంపై జనసేన నేతలు మండిపడ్డారు. మంత్రి చట్ట వ్యతిరేక పనులు చేస్తుంటే పోలీసులు తమాషా చూస్తున్నారని గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. పింఛన్ దారుల వద్ద వాలంటీర్లే.. లక్కీ డ్రా కోసం వంద రూపాయలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. అమాయక ప్రజలను దోచుకుంటున్నారని.. అంబటిపై క్రిమినల్ కేసు పెట్టాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సచివాలయాలు టికెట్ కౌంటర్స్‌గా మారాయని విమర్శించారు. మృతుడు అనిల్ చెక్‌ను మాయం చేశారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com