AP: దిగజారుతున్న ఏపీ ఆర్థిక పరిస్థితి.. జీతాలకోసం ఎదురుచూపులు

ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది.ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం, దివాళకొరు విధానాలతో ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెలా ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో సగం మందికి పైగా ఉద్యోగులు జనవరి నెల జీతం కోసంఎదురుచూస్తున్నారు. అనేక మందికి ఇంకా పింఛను సొమ్ము అందలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధుల మేరకు కేవలం కొంత మేర మాత్రమే జీతాలు చెల్లించినట్లు తెలుస్తోంది.
ఇంతవరకు 14 వందల కోట్లు ఉద్యోగులకు జీతాల రూపంలో చెల్లించారు. పెన్షనర్లకు 11 వందల కోట్ల చెల్లింపులు జరిగాయి.వాస్తవంగా జీతాల రూపంలో 3వేల700 కోట్లు, పెన్షనర్లకు రెండు వేల కోట్లు చెల్లించాలి. అయితే సగం మందికి మాత్రమే చెల్లించారు.ఏపీ సర్కార్ గత మంగళవారం రిజర్వుబ్యాంకు నుంచి 1వేయి557 కోట్లు రుణం తీసుకుంది.దీంతో పాటు రోజువారీ వచ్చే ఆదాయం, ఇవికాక ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, వేస్ అండ్ మీన్స్ తదితరాలు కలిపి 2 వేల700 కోట్ల వరకు వినియోగించుకున్నట్లు సమాచారం.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 2వేల కోట్ల వరకు ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జీతాలు, పెన్షన్లు మొత్తం అన్నీ చెల్లించేందుకు మరికొంత గడువు తప్పక పోవచ్చు. వచ్చే మంగళవారం రిజర్వుబ్యాంకు నుంచి బహిరంగ మార్కెట్ రుణాలు పొందే అవకాశమూ లేదు. ఇప్పటికే ఏపీ కేంద్రం ఇచ్చిన అనుమతుల మేరకు పూర్తిగా రుణాలు సమీకరించింది. కొత్తగా మరిన్ని అప్పుల కోసం కేంద్రం వద్ద ప్రయత్నాలు సాగిస్తున్నా అవి ఇంకా కొలిక్కి రాలేదని తెలిసింది. వేరే రూపాల్లోనూ రుణాల సమీకరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com