AP: సీఎం జగన్ సభ సీన్ రిపీట్

సీఎం జగన్ సభలో మరోసారి సేమ్ సీన్ రీపీటయింది. ఎప్పటి లాగే జగన్ సభ నుంచి జనం జంప్ అయ్యారు. తెనాలిలో ఎంతో ఆర్భాటంగా సభకు ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు. వేమూరు, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల నుంచి బస్సులో పెద్ద ఎత్తున జనాన్నితరలించారు. అయితే అంత కష్టపడి తరలించినా ప్రజలు కాసేపు కూడా ఉండలేదు. సీఎం రాకముందే అనేక మంది ప్రజలు జంప్ అయిపోయారు. ఇక సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే అనేక మంది వెళ్లిపోయారు. గోడలు దూకి వెళ్లిపోయిన దృశ్యాలు, ప్రధాన గేటు నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఇలా వెళ్లిపోతున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు, అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ మహిళలు మాత్రం ఆగలేదు. కనీసం సభలో కాసేపు కూడా కూర్చోవడానికి ఇష్టపడలేదు. సీఎం జగన్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com