AP : "విశాఖ శారదా పీఠం ధర్మం కోసమే పనిచేస్తుంది"

AP : విశాఖ శారదా పీఠం ధర్మం కోసమే పనిచేస్తుంది
ఎవరైనా శారదా పీఠాన్ని ఆశ్రయిస్తే యాగాలు చేస్తాం తప్పితే ఒక పార్టీకో, వ్యక్తికో అధికారం రావాలని ఎప్పుడూ చేయలేదు... చేయబోమని క్లారిటీ ఇచ్చారు

విశాఖ శారదా పీఠం ఏ రాజకీయపార్టీకి అనుకూలంగా పనిచేయదన్నారు స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి. ఎవరైనా శారదా పీఠాన్ని ఆశ్రయిస్తే యాగాలు చేస్తాం తప్పితే ఒక పార్టీకో, వ్యక్తికో అధికారం రావాలని ఎప్పుడూ చేయలేదు... చేయబోమని క్లారిటీ ఇచ్చారు. యజ్ఞం ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలను ఆశించి చేయలేదని.. తొలి నుంచీ పీఠంపై కొందరు ఉద్దేశపూర్వకంగా ముద్ర వేస్తున్నారని.. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలనే ఉద్దేశంతో పీఠం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. అందుకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు సహకారం అందిస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకులు ఆశ్రమానికి రావడంతోనే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.


లక్ష చండీ మహాయజ్ఞం నిర్వహించడం ఒక సరికొత్త చరిత్ర అన్నారు స్వాత్మానందేంద్ర సరస్వతి. దైవభూమిగా పేరున్న ఉత్తర భారతంలో తమ కార్యకలాపాలు విస్తరించడానికి, ఢిల్లీలో శారదా పీఠం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. హరియాణాలోని కురుక్షేత్రకు సమీపంలోని షాబాద్‌లో గుమ్తి ఆశ్రమం ఆధ్వర్యంలో లక్ష చండీ మహాయజ్ఞం ముగించారు.ఆధ్యాత్మిక చింతన పెంచేందుకే కార్యక్రమాలు చేపట్టామని, భారత దేశం హిందు దేశంగా ఉండాలని స్వామి ఆకాంక్షించారు.లక్ష చండి యజ్ఞం కుంభమేళా లాంటిదని ఇది కలియుగంలో అరుదుగా జరుగుతుందని, ఆద్యాత్మిక కార్యకలాపాలు విస్తరించడానే ఢిల్లీలో శారదా పీఠం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story