AP : ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

AP : ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌
X

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మూడు స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు అలవాటు పడ్డ వైసీపీ.. గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో కూడా అక్రమాలకు తెరలేపారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని బోగస్‌ ఓట్లను నమోదు చేశారని విమర్శించారు. పట్టభద్రులు కాని వారిని ఓటర్లుగా చేర్చారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల వారికీ ఓటు రాయించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. బోగస్‌ ఓటర్లపై, వారిని చేర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story