AP: రాజమండ్రిలో సైకో వీరంగం..

AP: రాజమండ్రిలో సైకో వీరంగం..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సైకో వీరంగం సృష్టించారు. ఆల్కట్ గార్డెన్స్‌ నారాయణ వీధిలో బీభత్సం చేశాడు. ఓ ఇంట్లో చొరబడి ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డాడు. మహిళలు కేకలు వేయడంతో స్థానికులు వారిని రక్షించి.. సైకోను చితకబాదారు. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సైకోను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story