AP: టీచర్‌ పోస్టులను రద్దు చేయడంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం

AP: టీచర్‌ పోస్టులను రద్దు చేయడంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం
ప్రతీ ఏటా జాబ్ కేలండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారని మండిపడుతున్నారు

ఏపీ సీఎం జగన్‌పై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఏటా జాబ్ కేలండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారని మండిపడుతున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపట్ల నిరుద్యోగులతో పాటు.. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేయడాన్ని తప్పుపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్క ఉమ్మడి విశాఖలోనే 553 ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యాయి. ఒక్కో మండలానికి నాలుగు నుంచి 24పోస్టులు రద్దయినట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. మెర్జింగ్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే అనేక సర్కారీ బడులు కనుమరుగయ్యాయన్న ఉపాధ్యాయులు.. ప్రభుత్వ నిర్ణయం ప్రాథమిక విద్యకు తీరని నష్టమన్నారు. అటు ప్రభుత్వం ఎప్పుడు డిఎస్సీ ప్రకటిస్తుందా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులు.. తాజా నిర్ణయంపై భగ్గుమంటున్నారు. ఉన్న పోస్టులనే రద్దు చేస్తున్న ప్రభుత్వం డిఎస్సీ పేరుతో డ్రామాలు ఆడుతోందని ఫైర్ అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story