AP : కర్నూలు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర

AP : కర్నూలు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతుంది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకుసాగుతున్న నారా లోకేష్.. అడుగడుగునా వైసీపీకి చెందిన ఎమ్మె ల్యేలు, మంత్రుల అవినీతిని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల ను ప్రజల్లో ఎండగడుతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్‌ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్యే రాంభూపాల్‌ రెడ్డిని బూతు పార్టీలో బూ తు రత్నమని.. కరప్షన్‌ కింగ్‌గా అభివర్ణించారు లోకేష్‌. ఈ సందర్భంగా సర్వే నంబర్లతో సహా ఎమ్మెల్యే రాంభూపాల్‌ రెడ్డి భూ కబ్జాలను, ఆయన అనుచరు లు చేసిన అవినీతిని ప్రజలకు తెలియజేశారు. వంద కోట్ల వక్ఫ్‌ భూములను కొట్టేసిన పాపం ఎమ్మెల్యే రాంభూపాల్‌ రెడ్డిని ఊరికే వదలన్నారు. సర్వే నెంబ ర్‌ 524లో 10ఎకరాలకుపైగా భూమిని కబ్జా చేశారంటూ ఆధారాలతో సహా బయ టపెట్టారు. దోచుకుంది చాలని.. తిరిగి ఇచ్చే యాలని.. లేకపోతే ప్రకృతి వదిలి పెట్టదని రాంభూపాల్‌ రెడ్డిని హెచ్చరించారు లోకేష్. ఎన్నిసార్లు గెలిచామని కాదు.. ఎంత అభివృద్ధి చేశామన్నదే ముఖ్యమని చురకలంటించారు.

ఇక తాను చేసిన ప్రతీ ఆరోపణకి రాంభూపాల్‌ రెడ్డి సమాధానం చెప్పకుండా కేవలం బూతులతో విరుచుకుపడటం ఎంత వరకూ కరెక్ట్‌ అని ప్రశించారు లో కేష్. రాయలసీమలో నీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ హయాంలో 11వేల 700 కో ట్లు ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినా టీడీపీ హయాంలో కర్నూలు జిల్లాను ఎంతో అభివృద్ధి చేశామని చెప్పిన లో కేష్.. రాయలసీమ అభివృద్ధికి జగన్‌ ఎంత ఖర్చు పెట్టారో చెప్పే దమ్ము, ధై ర్యం ఎమ్మెల్యే రాంభూపాల్‌ రెడ్డికి ఉందా అంటూ క్వశ్చన్ చేశారు. జిల్లాలో 14 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపిస్తే ఏం డెవలప్‌మెంట్‌ చేయ లేదని విమర్శించారు. మూడు రాజధానులు అని ప్రాంతాల మధ్య చిచ్చు పె ట్టడం తప్ప ఇకేం చేయలేదని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథ కంపై స్టే ఉంటే కనీసం లాయర్‌ని పెట్టి వాదనలు వినిపించడంలో ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకుల్ని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story