AP: "జగన్‌కి సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదు"

AP: జగన్‌కి సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదు

జగన్‌కి సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. అన్న క్యాంటిన్‌ను రద్దు చేసి పేదల పొట్ట కొట్టిన జగన్‌.. పేదల పెన్నిధి ఎలా అవుతారని ప్రశ్నించారు. ఉచిత ఇసుక రద్దు చేసి.. ఇసుక దోపిడీ చేస్తున్న వారు పేదల పెన్నిధి ఎలా అవుతారన్నారు. టిడ్కో ఇళ్లను ఇవ్వకుండా పేదలను వేధించిన జగన్‌.. పేదల పెన్నిధి ఎలా అవుతారని ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని.. దళితుల అసైన్డ్‌ భూములు లాక్కున్న ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం ఎలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు.

Tags

Next Story