AP : "సీఎం జగన్ పేరు చెప్పి క్రైస్తవులను మోసగించారు"

AP : సీఎం జగన్ పేరు చెప్పి క్రైస్తవులను మోసగించారు

సీఎం జగన్ పేరు చెప్పి... డబ్బులు ఇస్తామంటూ గుడ్ షెఫర్డ్ పౌండేషన్, పేద క్రైస్తవులను, పాస్టర్లను మోసగించిందని.. నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జాన్ మాస్క్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు. ఈ విషయమై డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశామని.. ఈ కుంభకోణంపై స్పందించి గుడ్ షెపర్డ్ సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాస్టర్లను టార్గెట్ చేసుకుని 10 వేలు కడితే 10 లక్షలు ఇస్తామని మాయ మాటలు చెప్పి.. కోట్లాది రూపాయలు వసూలు చేశారన్నారు. డ్వాక్రా సంఘాలకు కోటి రూపాయలు వరకు రుణాలు ఇస్తామని.. మహిళలను కూడా మోసం చేశారన్నారు. తమిళనాడులో 5సెంట్లు స్థలం ఇస్తామని ఆశచూపి ఒక్కొక్కరి నుంచి 5 లక్షలు వసూలు చేశారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని.. సీఎం జగన్ పేరు చెప్పి అనేకమంది పాస్టర్లు, పేద క్రైస్తవులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిపి రాజేంద్ర నాధ్ రెడ్డి వెంటనే ఈ కుంభకోణంపై స్పందించి.. గుడ్ షెపర్డ్ సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story