AP: స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డుల్లో సత్తా చాటిన ఏపీ

AP: స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డుల్లో సత్తా చాటిన ఏపీ
X
స్వ­చ్ఛ సర్వే­క్ష­ణ్‌­లో ఐదు అవా­ర్డు­ల­కు రా­ష్ట్రం­లో­ని 5 నగ­రా­లు ఎంపిక

రా­ష్ట్ర­ప­తి ద్రౌ­ప­దీ ము­ర్ము చే­తుల మీ­దు­గా ఏపీ మం­త్రి నా­రా­యణ స్వ­చ్ఛ­స­ర్వే­క్ష­ణ్‌ అవా­ర్డు­లు అం­దు­కు­న్నా­రు. స్వ­చ్ఛ సర్వే­క్ష­ణ్‌­లో ఐదు అవా­ర్డు­ల­కు రా­ష్ట్రం­లో­ని 5 నగ­రా­లు ఎం­పి­క­య్యా­యి. జీ­వీ­ఎం­సీ, వి­జ­య­వాడ, రా­జ­మ­హేం­ద్ర­వ­రం, గుం­టూ­రు, తి­రు­ప­తి ము­న్సి­ప­ల్‌ కా­ర్పొ­రే­ష­న్ల­కు అవా­ర్డు­లు దక్కా­యి. కా­ర్పొ­రే­ష­న్ల కమి­ష­న­ర్ల­తో కలి­సి మం­త్రి నా­రా­యణ.. రా­ష్ట్ర­ప­తి చే­తుల మీ­దు­గా అవా­ర్డు­లు అం­దు­కు­న్నా­రు. కేం­ద్ర­మం­త్రి మనో­హ­ర్‌­లా­ల్‌, ఏపీ స్వ­చ్ఛాం­ద్ర కా­ర్పొ­రే­ష­న్‌ ఛై­ర్మ­న్‌ పట్టా­భి­తో పాటు ఆయా కా­ర్పొ­రే­ష­న్ల అధి­కా­రు­లు కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్నా­రు.

‘క్లీన్‌ సిటీ’గా ఇండోర్

మధ్య­ప్ర­దే­శ్‌­లో­ని ఇం­డో­ర్‌ నగరం పరి­శు­భ్ర­త­లో మరో­సా­రి సత్తా చా­టిం­ది. దే­శం­లో­నే అత్యంత పరి­శు­భ్ర నగ­రాల జా­బి­తా­లో తొ­లి­స్థా­నం దక్కిం­చు­కొం­ది. 2024-25 సం­వ­త్స­రా­ని­కి గానూ ప్ర­క­టిం­చిన స్వ­చ్ఛ సర్వే­క్ష­ణ్‌ అవా­ర్డు­ల్లో వరు­స­గా ఎని­మి­దో­సా­రి కై­వ­సం చే­సు­కుం­ది. గు­జ­రా­త్‌­లో­ని సూ­ర­త్ రెం­డో స్థా­నా­న్ని దక్కిం­చు­కుం­ది. గత ఏడా­ది ఇం­దౌ­ర్‌­తో పాటు సూ­ర­త్‌ కూడా సం­యు­క్తం­గా తొలి ర్యాం­క్‌­లో ని­లి­చిన సం­గ­తి తె­లి­సిం­దే. మూడో స్థా­నం­లో నవీ ముం­బ­యి ని­లి­చిం­ది. ఇక, ఈసా­రి తె­లు­గు రా­ష్ట్రాల నుం­చి వి­జ­య­వాడ సత్తా చా­టిం­ది. ఈ జా­బి­తా­లో నా­లు­గో స్థా­నా­న్ని కై­వ­సం చే­సు­కుం­ది. 3-10 లక్షల జనా­భా జా­బి­తా­లో నో­యి­డా నగరం తొలి స్థా­నం­లో ఉంది. చం­డీ­గ­ఢ్‌, మై­సూ­ర్ తర్వా­తి స్థా­నా­ల్లో ని­లి­చా­యి. ది­ల్లీ­లో­ని వి­జ్ఞా­న్‌­భ­వ­న్‌­లో గృహ, పట్టణ వ్య­హ­రాల మం­త్రి­త్వ­శాఖ ఏర్పా­టు­చే­సిన కా­ర్య­క్ర­మం­లో రా­ష్ట్ర­ప­తి ద్రౌ­ప­దీ­ము­ర్ము గు­రు­వా­రం స్వ­చ్ఛ సర్వే­క్ష­ణ్‌ అవా­ర్డు­ల­ను ప్ర­దా­నం చే­శా­రు. ఈ మి­ష­న్‌ కింద 4,500 నగ­రా­ల­ను పరి­శీ­లి­స్తా­రు. పా­రి­శు­ద్ధ్యం, చె­త్త ని­ర్వ­హణ, సేవల అం­దు­బా­టు వంటి పలు కొ­ల­మా­నా­ల­ను పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కుం­టా­రు.

ఏపీకి 5 అవార్డులు..

స్వ­చ్ఛ సర్వే­క్ష­ణ్‌­లో ఐదు అవా­ర్డు­ల­కు ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని 5 నగ­రా­లు ఎం­పి­క­య్యా­యి. గ్రే­ట­ర్‌ వై­జా­గ్‌ ము­న్సి­ప­ల్‌ కా­ర్పొ­రే­ష­న్‌, వి­జ­య­వాడ, రా­జ­మ­హేం­ద్ర­వ­రం, గుం­టూ­రు, తి­రు­ప­తి ము­న్సి­ప­ల్‌ కా­ర్పొ­రే­ష­న్ల­కు అవా­ర్డు­లు దక్కా­యి. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు సం­బం­ధిం­చి సూ­ప­ర్‌ స్వ­చ్ఛ లీ­గ్‌ అవా­ర్డు­ల్లో 10 లక్షల కంటే ఎక్కువ జనా­భా కే­ట­గి­రీ­లో వి­జ­య­వాడ, 3-10 లక్ష­ల్లో­పు కే­ట­గి­రీ­లో గుం­టూ­రు, 50వేల నుం­చి లక్ష లోపు జనా­భా కే­ట­గి­రీ­లో తి­రు­ప­తి నగ­ర­పా­లక సం­స్థ­లు అవా­ర్డు­ల­కు ఎం­పి­క­య్యా­యి. కా­ర్పొ­రే­ష­న్ల కమి­ష­న­ర్ల­తో కలి­సి మం­త్రి నా­రా­యణ.. రా­ష్ట్ర­ప­తి చే­తుల మీ­దు­గా అవా­ర్డు­లు అం­దు­కు­న్నా­రు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నంబర్‌ వన్‌..

క్లీనెస్ట్‌ కంటోన్మెంట్ బోర్డ్ కింద ఇచ్చిన అవార్డుల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ తొలిస్థానాన్ని సొంతం చేసుకుంది. ‘వ్యర్థాల రహిత నగరం’ కేటగిరీలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ 7 స్టార్‌ రేటింగ్‌ సాధించింది.

Tags

Next Story